March 20, 202502:27:05 PM

KA Movie: కిరణ్ మార్కెట్ పెంచేసిన ‘క’ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని రూ.కోట్లంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన ప్రాజెక్ట్ లతో కిరణ్ అబ్బవరం మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘క’ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రయోగాలు చేసే విషయంలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  కూడా ముందువరసలో ఉన్నారని టీజర్ తో ప్రూవ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ కూడా ఏకంగా రూ.20 కోట్లు అనే సంగతి తెలిసిందే. ‘క’ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 12 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా.

కిరణ్ అబ్బవరం గత సినిమాల థియేట్రికల్ హక్కులు 4 నుంచి 6 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రెట్టింపు మొత్తానికి అమ్ముడవడం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక చిన్న నిర్మాత కమ్ బయ్యర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో కిరణ్ అబ్బవరం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతారో చూడాల్సి ఉంది. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటే భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు సైతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు ‘క’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయడం వెనుక అసలు కారణం తెలియాలన్నా కూడా సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

‘క’ సినిమా మేకర్స్ కు విడుదలకు ముందే భారీ లాభాలు రావడం ఖాయమని తేలిపోయింది. కిరణ్ అబ్బవరం కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కథల ఎంపికలో మార్పు కిరణ్ కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.