April 2, 202502:53:33 AM

Lavanya, Raj Tarun: రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. ‘తిరగబడరసామి’ ప్రమోషన్..కి వెళ్లి మరీ

రాజ్ తరుణ్ (Raj Tarun) – లావణ్య..ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ‘తిరగబడరసామి’ సినిమా హీరోయిన్ ‘మాల్వీ మల్హోత్రాతో అతను ఎఫైర్ పెట్టుకుని.. నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు’ అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వివాదం కారణంగా రాజ్ తరుణ్.. తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే మరో 2 రోజుల్లో ‘తిరగబడరసామి’ రిలీజ్ అవుతున్న సందర్భంగా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ‘క్యూ అండ్ ఎ’ లో పాల్గొన్న రాజ్ తరుణ్ కి వరుసగా లావణ్య కాంట్రోవర్సీ గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ‘లీగల్ గా పోరాడతాను’ అంటూ మొదట సమాధానం ఇచ్చినా తర్వాత అతను సహనం కోల్పోయాడు. ‘సినిమా గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి’ అంటూ అతని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. అయినా మీడియా వారు కరుణించలేదు. నాన్ స్టాప్ గా అతనిపై ప్రశ్నలు కురిపిస్తూనే వచ్చారు. మరోపక్క ఆ ఈవెంట్ జరుగుతున్న ప్రదేశంలోకి లావణ్య వెళ్లి ‘నా భర్తను కలవాలి’ అంటూ రచ్చ చేయడం మొదలుపెట్టింది.

ఆ తర్వాత ‘రాజ్ తరుణ్ మాటల్లో నిజం లేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం ‘నాకు 2 సార్లు అబార్షన్ చేయించాడు’ అంటూ ఆమె మరోసారి వివాదాస్పద కామెంట్లు చేసింది. అదే విధంగా ‘మాల్వీ పెళ్ళాం మాదిరి రాజ్ తరుణ్ తో ఎందుకు కలిసి ఉంటుంది’ అంటూ ప్రశ్నించింది. మొత్తానికి పాతది అయిపోతుంది అనుకుంటున్న రాజ్ తరుణ్- లావణ్య..ల వివాదం మళ్ళీ ట్రెండింగ్లో నిలవడం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.