March 25, 202511:29:02 AM

Mahesh Babu: ఒక స్టార్ లా ఎప్పటికీ షైన్ అవుతూ ఉండు.. మహేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు రాజమౌళి (SS Rajamouli) సినిమాతో ఇంటర్నేషన్ స్టార్ కావడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈరోజు సితార పుట్టినరోజు కాగా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ బాబు చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “హ్యాపీ 12 నా చిట్టి తల్లి.. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని కోరుకుంటున్నాను..

లవ్ యూ మోర్ అండ్ మోర్.. ఒకస్టార్ లా ఎప్పటికీ షైన్ అవుతూ ఉండు” అంటూ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ కు ఏకంగా 4.5 లక్షల లైక్స్ వచ్చాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సితార పుట్టినరోజు సందర్భంగా నమ్రత (Namratha Shirodhkar) ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పెషల్ వీడియోను పంచుకున్నారు.

నమ్రత తన పోస్ట్ లో “నా చిట్టి ప్రయాణ సహచరురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. వివిధ దేశాలు.. లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకు ట్రావెల్ గైడ్ లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు.. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా.. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్” అంటూ నమ్రత కూతురిపై ప్రేమను చాటుకున్నారు. సితార చిన్న వయస్సులోనే మంచి పేరు సంపాదించుకున్నారు.

సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సితార కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఒక ప్రముఖ సంస్థకు సితార బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు. భవిష్యత్తులో నటి అవుతానని సితార చెబుతున్న నేపథ్యంలో ఆమె కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సితార భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ స్టేటస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.