March 28, 202503:21:47 AM

Malavika Mohanan: ‘తంగలాన్‌’ సినిమా కష్టాలు చెప్పుకొచ్చిన బోల్డ్‌ బ్యూటీ.. ఏం చెప్పిందంటే?

‘తంగలాన్‌’ (Thangalaan) సినిమా నుండి హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పుడు ‘అందగత్తెను ఇలా చేసేశారేంట్రా బాబూ..’ అని అనుకోని అభిమాని ఉండరు. సోషల్‌ మీడియాలో మోస్ట్‌ బోల్డ్‌ ఫొటో షూట్లతో అదరగొట్టే ఈ భామను డిఫరెంట్‌ లుక్‌లో చూపించారు. ఆ డీగ్లామరస్ లుక్‌లో ఆమెను చూసినవాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు అనుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ లుక్‌ కోసం, ఆ సినిమా కోసం పడ్డ కష్టాలు వింటుంటే వామ్మో అనిపిస్తోంది.

‘తంగలాన్‌’ సినిమాలో విక్రమ్‌ (Vikram) హీరో అనే విషయం తెలిసిందే. నటీనటులందరూ డీ గ్లామర్‌ రోల్స్‌ కనిపిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ (Malavika Mohanan)  , పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu)  హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాళవిక మోహనన్‌ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఒక రోజు సెట్‌కు వెళ్లేసరికి పెద్ద గేదెను తీసుకొచ్చారట.

ఆ తర్వాత దర్శకుడు వచ్చి గేదెను ఎక్కగలవా అన్నారట. ఏదో సరదాగా అంటున్నారు అనుకుందట మాళవిక. అయితే కాసేపటికి ఆమె మేకప్‌ పూర్తయిన తర్వాత వచ్చాక నిజంగానే గేదెపై ఎక్కడి కూర్చోమన్నారట. గేదెపైకి ఎక్కిన అనుభవం మాళవికకు లేదట. ఆ మాట చెప్పే ప్రయత్నం చేసినా దర్శకుడు వినలేదట. సన్నివేశం చిత్రీకరించాలి ఎలాగైనా గేదెపై కూర్చోవాలని అడిగారట. దీంతో భయంతోనే ఎక్కిందట. సినిమా కథ నెరేట్‌ చేసినప్పుడు, సన్నివేశాలు చెప్పినప్పుడు అలాంటి సన్నివేశం గురించి చెప్పలేదట దర్శకుడు.

ఇక ఈ సినిమా రోజూ ఐదు గంటలు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చిందట. దాదాపు 10 గంటలపాటు కెమికల్స్‌తో చేసిన మేకప్‌ శరీరంపై ఉండేసరికి ఎలర్జీ వచ్చిందట. దీంతో వైద్యుల్ని సంప్రదించాల్సి వచ్చింది అని చెప్పింది మాళవిక. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఇంకాస్త ఆశ్చర్యపోవచ్చు అని సినిమా టీమ్‌ చెబుతోంది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు సినిమాలో ఉన్నాయి అని అంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.