March 20, 202511:36:54 AM

Mirai: ప్రభాస్‌కి లైన్‌ ఇచ్చేశారు సరే.. ఎప్పుడొస్తారు మరి?

ఒక సినిమా రిలీజ్‌ డేట్ మరో పినిమాను కచ్చితంగా ఎఫెక్ట్‌ చేస్తుంది. అందులోనూ ఆ సినిమా అగ్ర హీరోది అయితే కచ్చితంగా ఉంటుంది. అందులోనూ పాన్‌ ఇండియా హీరోది అయితే ఇంకా కష్టం. ఇప్పుడు అలా ఓ కుర్ర హీరో సినిమా మీద ఎఫెక్ట్‌ పడబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఆ సినిమాల నిర్మాత డిఫరెంట్‌గా ఆలోచిస్తే ఏమో కానీ.. లేదంటే ఎప్పుడో ప్రకటించేసిన కుర్ర హీరో సినిమా డేట్ మారకతప్పదు. ఇంతకీ ఏమైందంటే..

ప్రభాస్‌ (Prabhas) – మారుతి (Maruthi Dasari)  కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫ్యాన్‌ ఇండియా’ సినిమా ‘రాజా సాబ్‌’(The Rajasaab) . ఈ సినిమా నుండి రీసెంట్‌గా గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా చెప్పారు. దీంతో మరో సినిమా విషయంలో డౌట్స్‌ మొదలయ్యాయి. ఎందుకంటే రెండు సినిమాల రిలీజ్‌లకు మధ్య ఉన్న గ్యాప్‌ కేవలం వారం మాత్రమే. దానికేముంది వారం గ్యాప్‌ కదా అనొచ్చు. ప్రభాస్‌ సినిమాకు ఒక వారం బాక్సాఫీసు సరిపోదు కదా అనేది ఇక్కడ పాయింట్.

ఇక్కడో విషయం ఏంటంటే.. రెండు సినిమాలకు ఒక్కరే నిర్మాత. తొలి సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రెండో సినిమా పేరు ఇక్కడ చెప్పాల్సిందే. అదే ‘మిరాయ్‌’ (Mirai) . తేజ సజ్జా (Teja Sajja)  , మంచు మనోజ్‌ (Manchu Manoj) ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్‌ చేస్తాం అని చెప్పారు. ‘రాజాసాబ్‌’ సినిమా ఏప్రిల్‌ 10న వస్తున్న నేపథ్యంలో ‘మిరాయ్‌’ మారక తప్పదు అని అంటున్నారు. మరి మారుతారా? లేక అలానే వచ్చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Big Planning Behind The Story of Mirai Movie

అయితే థియేటర్లలో పీపుల్స్‌ మీడియా సినిమాలే రెండు వారాలు ఉండాలి అనుకుంటే రిలీజ్‌ చేసేస్తారు. దీనికి స్ఫూర్తి గత ఏడాది సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ చేసిన పనే. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) , ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) ఇలానే ఒకేసారి వచ్చాయి. మరిప్పుడు పీపుల్స్‌ మీడియా అలానే ఆలోచిస్తే చెప్పలేం. వారం గ్యాప్‌ ఉంది కాబట్టి.. ఈలోపు ‘ఫ్యాన్‌ ఇండియా’ సినిమా స్లో అయితే.. ‘మిరాయ్‌’తో కవర్‌ చేయొచ్చు అని నిర్మాత అనుకుంటున్నారేమో అనే చర్చ కూడా వినిపిస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.