March 22, 202508:58:18 AM

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ప్లానింగ్ అలా ఉందా.. ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారా?

నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తేలిపోయింది. అయితే ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేక బోయపాటి శ్రీను  (Boyapati Srinu) డైరెక్షన్ లో అఖండ2 (Akhanda)  సినిమాతో ఎంట్రీ ఇస్తారో క్లారిటీ లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం మోక్షజ్ఞ అఖండ2 సినిమాలో సెకండాఫ్ లో కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. బోయపాటి సినిమాలలో హీరో పాత్రలకు భారీ స్థాయిలో ఎలివేషన్స్ ఉంటాయి. మోక్షజ్ఞకు ఫస్ట్ సినిమాతోనే అలాంటి ఎలివేషన్లు దక్కితే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ సైతం కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని ఇకపై సినిమాలే మోక్షజ్ఞ ప్రపంచం కాబోతున్నాయని భోగట్టా. మోక్షజ్ఞకు మంచి గుర్తింపు వచ్చే వరకు సొంత బ్యానర్ పైనే సినిమాలను నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మోక్షజ్ఞ యాక్టింగ్ లో శిక్షణ పొందారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉందని పాన్ ఇండియా హీరోగా మోక్షజ్ఞకు మంచి గుర్తింపు దక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతూ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ త్వరలో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నందమూరి మోక్షజ్ఞ లేట్ గా ఎంట్రీ ఇచ్చినా సినిమా సినిమాకు మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మోక్షజ్ఞ సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞకు భారీ రెమ్యునరేషన్ ను సైతం ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మోక్షజ్ఞ యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించేలా కెరీర్ ప్లానింగ్స్ ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.