March 21, 202502:33:54 AM

Nandamuri Mokshagna: నందమూరి వారసుడు తొలి సినిమా.. ఆల్‌ రెడీ.. ఆషాఢం వెళ్లగానే..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అనే ప్రశ్న కాస్త.. ఇదిగో ఆ రోజే, అదిగో ఈ రోజే అనే స్థాయికి చేరింది. ఎందుకంటే మోక్షు ఇప్పుడు సినిమా హీరో మెటీరియల్‌గా ట్రాన్స్‌ఫామ్‌ అయ్యాడు. దీంతో ఎప్పుడు సినిమా స్టార్ట్‌, ఎవరు దర్శకుడు, హీరోయిన్‌ ఎవరు, నిర్మాత ఎవరు అనే చర్చలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి అధికారిక సమాచారం వచ్చే రోజు మరో నెల రోజుల్లో ఉంది అంటున్నారు.

అవును, ఇప్పుడు నడుస్తున్న ఆషాఢ మాసం గడిచాక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చాలానే తెలుస్తాయి అని చెబుతున్నారు. అయితే అప్పటివరకు పుకార్లను ఆపలేం కదా.. అందుకే వాటి గురించి ఓ లుక్కేద్దాం. ఈ సినిమాకు సంబంధించిన కథను నందమూరి బాలకృష్ణ దగ్గరుంది సిద్ధం చేస్తున్నారని టాక్‌. గతంలో బాలయ్య.. మోక్షు కోసం ‘ఆదిత్య 369’ కథను సిద్ధం చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఈ కథ అలానే ఉంటుంది అంటున్నారు.

ఇక ఈ సినిమాను ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) డైరెక్ట్‌ చేస్తారని సమాచారం. ‘హను – మాన్‌’ (Hanu Man) తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా ఆయన వాటిని వదులుకుంటున్నది ఈ సినిమా కోసమే అని టాక్‌ నడుస్తోంది. ఇక ఈ సినిమా నందమూరి సొంత బ్యానర్‌ మీదే ఉంటుంది అని సమాచారం. ఈ మేరకు మోక్షజ్ఞ సోదరి తేజస్విని నిర్మాత అవుతున్నారట. కొత్త బ్యానర్‌ ప్రారంభిస్తారని చెబుతున్నారు.

మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఒక దశలో బాలకృష్ణనే డైరెక్ట్‌ చేస్తారు అని కూడా చెప్పారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను (Boyapati Srinu) , రాహుల్ సాంకృత్యాన్‌ (Rahul Sankrityan) అంటూ చాలా పేర్లు వచ్చాయి. అయితే వాళ్లెవరూ ఓకే అవ్వలేదు. ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ  పేరు కూడా అఫీషియల్‌ కాదు. ఆషాఢం తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. సో వెయిటింగ్‌ ఫర్‌ ఆషాఢం ఎండింగ్‌ అన్నమాట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.