March 17, 202507:40:30 AM

Palak Muchchal: 3000 మంది పిల్లలకు ఆపరేషన్స్ చేయించిన సింగర్.. మంచి మనస్సంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో ఉంది. మహేష్ బాబు తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం ద్వారా మహేష్ బాబు వార్తల్లో నిలిచారు. ఇంత మంచి మనస్సు ఉన్న హీరోలు చాలా తక్కువమంది ఉంటారని అభిమానులు సైతం ఫీలవుతారు. ఇక్కడ మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్స్ చేయించిన విధంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో పాలక్ ముచ్చల్ 3000 మందికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ను నిర్వహించడం ద్వారా పాపులర్ అయిన పాలక్ ముచ్చల్ (Palak Muchhal) స్వతహాగా డాక్టర్ కావడం గమనార్హం. తాను సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది పిల్లలను కాపాడటానికేనని ఆమె చెబుతున్నారు. వేల సంఖ్యలో పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి ప్రశంసలు అందుకుంటున్న పాలక్ ముచ్చల్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పాలక్ ముచ్చల్ రాబోయే రోజుల్లో మరో 400 మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించాలని భావిస్తున్నారు. ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తే 14 మంది పిల్లలకు ఆపరేషన్స్ చేయించవచ్చని ఆమె వెల్లడించారు. పిల్లల ప్రాణాలను కాపాడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పాలక్ ముచ్చల్ పేర్కొన్నారు. పాలక్ ముచ్చల్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సహాయం చేసే మంచి మనస్సు అందరికీ ఉండదని పాలక్ ముచ్చల్ కు మాత్రమే ఆ మనస్సు ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పాలక్ ముచ్చల్ సహాయం చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి కొందరు సెలబ్రిటీలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తే ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలను కాపాడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by The Better India (@thebetterindia)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.