March 22, 202506:33:48 AM

Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన ఆనంద్ సాయి.. సింపుల్ లైఫ్ స్టైల్ అని చెబుతూ?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ఫలితాలు వెలువడిన నిమిషం నుంచి రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులలో ఆనంద్ సాయి ఒకరు కాగా పవన్ గొప్పదనం గురించి తాజాగా ఆనంద్ సాయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆఫీస్ ను ఆనంద్ సాయి రీ మోడలింగ్ చేయగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతారని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఆఫీస్ నిర్మాణం చేశామని ఆనంద్ సాయి అన్నారు. పవన్ కు నచ్చిన రంగులను ఆఫీస్ లో వేశామని ఆయన చెప్పుకొచ్చారు. భారీ మెజారిటీతో గెలిచినా పవన్ లో గర్వం లేదని ఆయన వెల్లడించారు. ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో సింపుల్ గానే క్యాంపు కార్యాలయాన్ని డిజైన్ చేశామని ఆనంద్ సాయి తెలిపారు. పవన్ తెలుపు రంగును ఇష్టపడతారని అందుకే ఆఫీస్ కు లైట్ కలర్స్ వేశామని ఆయన చెప్పుకొచ్చారు.

ఫర్నీచర్‌ను ఫ్యాబ్రిక్‌తో చేశామని ఆనంద్ సాయి వెల్లడించారు. నేను మొదటిసారి చూసినప్పుడు పవన్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని ఆయన తెలిపారు. తొలిప్రేమ సినిమా సమయంలో పవన్ ను తొలిసారి కలవడం జరిగిందని అప్పటినుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అంతే వినయంగా ఉన్నారని ఆనంద్ సాయి కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ ఆగష్టు నెలాఖరు నుంచి షూట్ లో పాల్గొననున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పవన్ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయని చెప్పవచ్చు. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేస్తే ఫ్యాన్స్ ఎంతో సంతోషించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.