April 5, 202501:43:56 AM

Pawan Kalyan: పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన బెంగాలీ నటి.. గ్రేట్ పర్సన్ అంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపుతో పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఒక పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం సులువైన విషయం కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. అయితే ఒక బెంగాలీ నటి పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

అలనాటి రామచంద్రుడు అనే చిన్న సినిమాలో నటించిన మోక్ష (Mokksha) అనే బెంగాలీ నటి పవన్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాలు బెంగాల్ లో డబ్ అవుతాయని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ హీరోయిన్లు అయిన సాయిపల్లవి (Sai Pallavi), రష్మిక (Rashmika) అంటే ఇష్టమని చెప్పిన ఈ నటి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని ఆమె కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశం మొత్తం తెలుసని మోక్ష వెల్లడించారు.

తెలుగు వాళ్లు, తెలుగు సినిమాల గురించి ప్రస్తుతం దేశం అంతటా చర్చ జరుగుతోందని మోక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తన సక్సెస్ తో దేశమంతటా మాట్లాడుకునేలా చేశారని ఆమె తెలిపారు. మోక్ష చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో నటించే సినిమాలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.