March 28, 202502:03:58 PM

Prabhas: సెట్ లో ప్రభాస్ అలా పిలిచేవారు.. కల్కి యాక్టర్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మనస్సు బంగారం అని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తనకంటే పెద్దవాళ్లను ఎప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకుంటారని చిన్నవాళ్లు ఏదైనా తప్పు చేసినా వాళ్లకు అర్థం అయ్యేలా చెబుతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రభాస్ మూవీ షూటింగ్ లో పాల్గొనే వాళ్లందరికీ ప్రభాస్ ఇంటినుంచి ఫుడ్ వస్తుందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కల్కి సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.

కల్కి(Kalki 2898 AD)   సినిమాలో ముఖ్య పాత్రలో నటించి తన నటనతో మెప్పించిన హుంహు ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, దీపికతో  (Deepika Padukone) నాకు సీన్స్ ఉన్నాయని అమితాబ్ బచ్చన్ గారితో మాత్రం ఎలాంటి సీన్స్ లేవని ఆయన వెల్లడించారు. ప్రభాస్ కు తాను వీరాభిమానినని నాకు సినిమాలు కొత్త అని హుంహు చెప్పుకొచ్చారు. కల్కి సీక్వెల్ లో అమితాబ్ (Amitabh Bachchan)  కాంబినేషన్ సీన్లలో నటిస్తే బాగుండని ఫీలవుతున్నానని ఆయన తెలిపారు.

సెట్ లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవారని హుంహు వెల్లడించారు. ఒక యాక్షన్ సీన్ షూటింగ్ సమయంలో ప్రభాస్ నన్ను పక్కకు తీసుకెళ్లి కొన్ని టిప్స్ చెప్పారని ఆయన కామెంట్స్ చేశారు. ప్రభాస్ రేంజ్ కు ఆయన నాకు దగ్గరుండి టిప్స్ చెప్పాల్సిన అవసరం అయితే లేదని అయినప్పటికీ సొంత అన్న ఎలా సలహాలు, సూచనలు ఇస్తారో అదే విధంగా ప్రభాస్ నాకు సూచనలు ఇచ్చారని హుంహు పేర్కొన్నారు.

దీపిక సైతం జోక్ చెప్పి నన్ను నవ్వించిందని హుంహు తెలిపారు. ప్రభాస్, దీపిక పెద్ద స్టార్స్ మాత్రమే కాదని పెద్ద మనస్సు ఉన్నవాళ్లు కూడా అంటూ ఆయన వెల్లడించారు. కల్కి సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.