April 4, 202511:02:14 PM

Prabhas: ప్రభాస్‌ – హను కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా? ఎప్పుడు ప్రారంభం అంటే?

ప్రభాస్‌ (Prabhas)  ఎందుకో కానీ వరుస సినిమాలు ఓకే చేసేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు వస్తున్న విధానం, చేస్తున్న విధానం చూస్తుంటే ఇవి ఎప్పటికి అవుతాయి, ఎప్పుడు వస్తాయి అనేది అర్థం కావడం లేదు. ఆ విషయం పక్కనపెడతే ఆయన రీసెంట్‌గా అనౌన్స్‌ చేయకుండా చేసిన సినిమా హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. అదే సినిమా పేరు.

హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఇటీవల ‘సీతా రామం’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో సైనికుడు. అతనికో ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమ కోసమే సినిమా అంతా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్‌తో చేయనున్న సినిమా కూడా ఇంచుమించు అలాంటి కథతోనే రూపొందనుందట. అంతేకాదు ఈ సినిమాకు సైనికుడు అనే పేరు పెడతారని టాక్‌ నడుస్తోంది.

అయితే యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా కాదు కానీ.. హిందీలో ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ లెక్కన ఈ సినిమాలో ప్ర‌భాస్ సైనికుడిగా న‌టిస్తాడని మనకు అర్థమవుతుంది. ఇక సినిమా కథ సంగతి చూస్తే.. 1947 కంటే ముందు సాగే క‌థ ఇది అని అంటున్నారు. బ్రిటీష్ సైన్యంలో ఓ సోల్జ‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించనున్నాడట. ఎప్పటిలాగే యుద్ధ నేప‌థ్యంలో సినిమా కథ ఉన్నా.. హ‌ను స్టైల్ అంద‌మైన ప్రేమ‌క‌థ ఉంటుందట.

ఇక ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించినా ఆఖరికి.. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) పేరునే ఖరారు చేశారు అని అంటున్నారు. ఆమెకు ట్రేడ్‌ మార్క్‌గా నిలిచే పెద్దింటి అమ్మాయి పాత్రలా ఇదీ ఉంటుంది అని చెబుతున్నారు. ఇక విశాల్ చంద్ర‌శేఖ‌ర్ (Vishal Chandrasekhar) ఈ సినిమాకు సంగీతం అందిస్తారట. మైత్రీ మూవీస్ మేకర్స్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ వివరాలు అధికారికంగా చెబుతారు అని అంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.