
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt) తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt)..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – ప్రభాస్..ల కాంబినేషన్లో వచ్చే సీన్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో ప్రభాస్ రోల్ ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) . అలాగే కమల్ హాసన్ (Kamal Haasan) పాత్రకి కూడా మంచి లీడ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ‘కల్కి 2898 ad’ సినిమాలో ప్రభాస్… భైరవ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ బౌంటీ హంటర్ గా ఎక్కువ సేపు కనిపించాడు.
బౌంటీ హంటింగ్ అంటే క్రిమినల్స్ ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించి బహుమానం పొందడం. ‘కల్కి 2898 ad ‘ లోనే కాదు గతంలో కూడా ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించాడు. ఇందులో అంటే.. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘బుజ్జిగాడు’ (Bujjigadu) తర్వాత ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) అనే సినిమా చేశాడు. ఇందులో కూడా ప్రభాస్ బౌంటీ హంటర్ గా నటించాడు.విలన్ సోనూ సూద్ తో (Sonu Sood) ఓ సందర్భంలో తాను బౌంటీ హంటర్… అంటూ చెప్పే సీన్ కూడా ఒకటి ఉంటుంది.