March 28, 202502:12:07 PM

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరంటున్న ఫ్యాన్స్!

స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas)  ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తను సంతోషంగా ఉండటంతో పాటు తన చుట్టూ ఉండేవాళ్లు సంతోషంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి (Maruthi Dasari) కూతురు ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రాజాసాబ్ (The Rajasaab) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మారుతి కూతురు హియ ఒక ఈవెంట్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్టార్ హీరో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారని హియ పేర్కొన్నారు. సెట్ లో ప్రభాస్ ఉంటే సులువుగా తెలిసిపోతుందని ఆమె కామెంట్లు చేశారు. బాహుబలి (Baahubali: The Beginning) సినిమా నుంచి ప్రభాస్ కు నేను అభిమానిగా మారానని హియ అన్నారు. ప్రభాస్ సినిమాలు విడుదలైన రోజున చూడాల్సిందేనని హియ వెల్లడించారు.

రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నానని ఆమె తెలిపారు. ఒకరోజు సెట్ లో చాక్లెట్ కావాలని నేను చెప్పడం చూసిన ప్రభాస్ ఒక్క చాక్లెట్ అడిగితే ప్లేట్ నిండా చాక్లెట్స్ పంపారని చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో ప్రభాస్ అంతలా ఉంటారని ఆమె కామెంట్లు చేశారు. ఇతరులకు ఏం అవసరం ఉన్నా వేగంగా స్పందించే విషయంలో ప్రభాస్ కు ఎవరూ సాటిరారని ఈ విషయంలో ప్రభాస్ ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రభాస్ సినిమాల బడ్జెట్లు భారీ రేంజ్ లో ఉండగా ప్రభాస్ తో హిట్ సినిమా నిర్మిస్తే ఆ నిర్మాతకు వచ్చే లాభాలు భారీ స్థాయిలో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.