March 22, 202504:22:47 AM

Ram Charan: ‘భారతీయుడు 2’ హిట్ అవ్వాలని కోరుకుంటున్న రాంచరణ్ ఫ్యాన్స్.!

కమల్ హాసన్ (Kamal Haasan) , శంకర్ (Shankar)  కాంబినేషన్లో ‘భారతీయుడు’ వచ్చింది. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. 28 ఏళ్ళ తర్వాత ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా రూపొందింది. జూన్ 12 న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జర్నీ అంతా సాఫీగా సాగలేదు. 2020 లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ కొద్ది రోజులకే ‘ఓ ఘోర ప్రమాదం జరగడం’ తో ఆగిపోయింది.

తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ కూడా కోవిడ్ కారణంగా మరణించాడు. అంతేకాదు నిర్మాతలతో గొడవ వల్ల శంకర్ కూడా ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి.. రాంచరణ్ తో (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  మొదలుపెట్టాడు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలుపెట్టి ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ‘భారతీయుడు 2’ నిర్మాతలైన ‘లైకా’ వారు శంకర్ పై కేసు వేయడంతో.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. మొత్తానికి 2 సినిమాలను సమాంతరంగా కంప్లీట్ చేశాడు శంకర్.

అయితే ‘భారతీయుడు 2’ సినిమా బజ్ లేకుండా రిలీజ్ అవుతుంది. హిట్ టాక్ వస్తే తప్ప బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి.. ఈ సినిమా హిట్ అవ్వాలని రాంచరణ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ‘భారతీయుడు 2’ టాక్ కనుక తేడాగా వస్తే ‘గేమ్ ఛేంజర్’ పై హైప్ జెనరేట్ అవ్వడం కష్టం. అందుకే ‘భారతీయుడు 2’ రిజల్ట్ పై రాంచరణ్ ఫోకస్ కూడా పడింది అని చెప్పాలి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.