March 22, 202509:39:50 AM

Ram Charan Car Collection: రామ్‌చరణ్‌ గ్యారేజీలో ఎన్ని కార్లున్నాయో తెలుసా? వాటి ధరలు తెలుసా?

వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ వివాహం కోసం ముంబయి వెళ్లడానికి రామ్‌చరణ్‌ (Ram Charan) బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాడు. అంత ఖరీదైన పెళ్లికి కదా అనుకున్నాడేమో అత్యంత ఖరీదైన కారుతో వచ్చాడు. దాని ధర సుమారు రూ. 7.5 కోట్లు అట. దీంతో ఆ కారు, దాని ధర వైరల్‌గా మారాయి. అయితే ఇక్కడ మరో విషయం ఇప్పటివరకు చరణ్‌ దగ్గర ఉన్న కార్ల లిస్ట్‌ కూడా వైరల్‌గా మారింది.

రామ్ చరణ్‌కు కార్లు అంటే చాలా మోజు. అందుకే తన గ్యారేజ్‌లో చాలా కార్లు ఉన్నాయి. తాజాగా ఆ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. ఆ కారు దేశంలోనే రెండోది కాగా, హైదరాబాద్‌లో మొదటిది కావడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని కార్లు చరణ్‌ గ్యారేజీలో ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్‌ఎస్‌ 600 మోడల్‌ కారు ధర సుమారు రూ. 4 కోట్లు. ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 ధర దాదాపు రూ. 3.2 కోట్లుగా ఉంది.

ఫెరారీ పోర్టోఫినో కారు ధర సుమారు రూ 3.50 కోట్లు కాగా, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ధర రూ 2.75 కోట్లు ఉండొచ్చు. వీటితోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు ధర సుమారు రూ. 1.75 కోట్లుగా ఉంది. ఇక రీసెంట్‌గా తీసుకున్న రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు విలువ సుమారు రూ. 7.5 కోట్లు. ఈ కారు గతేడాది జనవరిలో ఇండియాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లో చూస్తుంటే చరణ్‌ కార్ల మోజు అర్థమవుతుంది.

ఇక చరణ్‌ సినిమాల సంగతి చూస్తే.. శంకర్‌ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో బుచ్చిబాబు సానా (Buchi Babu)  సినిమా స్టార్ట్‌ అవుతుందట. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ త్వరలో వస్తుందంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.