March 20, 202502:27:00 PM

Rashmika: శ్రీవల్లిని చూసి ఈ సినిమా ఛాన్స్‌ ఇచ్చారా? ఆ సినిమాలోనూ అలానే..

ఒక సినిమా మరో సినిమా ఛాన్స్‌ను తెచ్చి పెడుతుంది అంటుంటారు. ఈ విషయంలో మీకేమైనా డౌట్‌ ఉంటే.. రష్మిక మందన (Rashmika) గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న సినిమా.. అలాగే త్వరలో చేయబోతున్న సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె, ఇప్పుడు చేస్తున్న సినిమా అంటే ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) .. ఇక గతంలో సినిమా అంటే ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise) . ఇక చేయబోతున్న సినిమా అంటే.. రాహుల్‌ సాంకృత్యాన్‌ (Rahul Sankrityan) దర్శత్వంలో రూపొందబోయే సినిమా.

‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్ర చాలా కీలకం. అంతేకాదు ఆమెకు ఆ పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని తెచ్చిపెట్టింది. వరుస అవకాశాలూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ పాత్ర తరహాలోనే మరో సినిమాకు ఆమె ఓకే చెప్పింది అంటున్నారు. శ్రీవల్లి తరహాలోనే రాయల సీమ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. సీమ యాస, ఆహార్యంతోనే దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ఓ కథ సిద్ధం చేశారట.

సహజత్వానికి దగ్గరగా ఉండే ఆ కథ రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగుతుంది అని సమాచారం. ఈ కథకు ఎవరు బాగుంటారు అనే క్రమంలో శ్రీవల్లి అలియాస్‌ రష్మిక మందన గుర్తొచ్చిందట. ఆమె కూడా ఇప్పుడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలకు ఓకే చెబుతుంటంతో ఆమెనే సంప్రదించారట. ఆమె కూడా కథ పట్ల ఆసక్తి చూపిస్తోంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీవల్లి పాత్ర నుండి బయటికి రాగానే రష్మిక మరో సీమ నాయిక అయిపోతుంది.

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ (Allu Arjun) – సుకుమార్  (Sukumar)‘పుష్ప: ది రూల్‌’, రాహుల్‌ రవీంద్రన్‌ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, నాగార్జున (Nagarjuna) – ధనుష్‌ (Dhanush) – శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) ‘కుబేర’, సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) – మురగదాస్‌ (A.R. Murugadoss) ‘సికందర్‌’, శంతరుబన్‌ బైలింగ్వుల్‌ ‘రెయిన్‌ బో’, విక్కీ కౌశల్‌ ‘చావా’ సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు ‘యానిమల్‌’ (Animal) సినిమా సీక్వెల్‌ ‘యానిమల్‌ పార్క్‌’లో కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడనేది తెలియాలి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.