March 22, 202501:58:24 AM

Ravi Teja: ఏజ్‌ గ్యాప్‌ చర్చ అవసరమా? అది కూడా కేవలం రవితేజ విషయంలోనే ఎందుకు?

మాస్‌ మహరాజా రవితేజ (Ravi Teja) సినిమా ఒకటి ప్రారంభమవుతోంది, షూటింగ్‌ జరుపుకుంటోంది, రిలీజ్‌ అవుతోంది అంటే.. ఒక చర్చ కచ్చితంగా మొదలవుతుంది. అది ఆయన సినిమా పేరో, పాత్ర పేరో, రిలీజ్‌ డేటో కాదు.. ఆయన వయసు. అదేంటో కానీ.. ఇండియన్‌ సినిమాలో ఆయనంత వయసుతో ఆయనొక్కరే ఉన్నట్లు, అంతకంటే ఎక్కువ వయసున్న హీరోలు లేనట్లు లెక్కలేసేస్తుంటారు. ఇదిగో హీరో – హీరోయిన్‌ మధ్య వయసులో తేడా ఇంత అంటూ బలంగా లెక్కలేసేస్తున్నారు.

తాజాగా రవితేజ కొత్త సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అందులో హీరోయిన్‌ భాగ్య శ్రీ భోర్సేతో (Bhagyashree Borse) ఓ స్కూటర్‌ మీద ఎదురెదురుగా కూర్చుని రవితేజ మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. చూడటానికి భలేగా ఉన్న పోస్టర్‌ గురించి మాట్లాడటానికి ఏమీ లేదేమో.. వయసు టాపిక్‌ బయటకు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య తేడా ఇంత అంత అంటూ లెక్కేలేస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గతంలో ‘ధమాకా’ (Dhamaka) సినిమా షూటింగ్‌ సమయంలో, రిలీజ్‌ సమయంలో కూడా ఇలానే చేశారు. ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి మాట్లాడారు. దీనికి ఆయనెప్పుడూ తెర మీద ఈజ్‌, గ్రేస్‌, యాక్టివ్‌నెస్‌తో సమాధానం చెప్పారు. రవితేజ – శ్రీలీల (Sree Leela) జోడీ బ్లాక్‌బస్టర్‌ కొట్టి బెస్ట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్లే వస్తుండటంతో మరోసారి అదే జరుగుతుందని రవితేజ అభిమానులు లెక్కలేస్తున్నారు.

ఆ విషయం పక్కనపెడితే అసలు రవితేజకు మాత్రమే ఎందుకీ ఏజ్‌ గ్యాప్‌ రచ్చ అనేది మొదలైంది. రవితేజ వయసు ఎంత అని మేం ప్రస్తావించడం లేదు.. ఎందుకంటే మీకే తెలుసు. అయితే అతని కంటే ఎక్కువ వయసున్న హీరోల సరసన కుర్ర హీరోయిన్లు నటించారు. దీనికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని వుడ్స్‌ డిఫరెన్స్‌ ఏమీ లేదు. అన్ని చోట్లా ఇదే జరిగింది. మరి ఆ హీరోల విషయంలో లేని ఈ పట్టింపు రవితేజకే ఎందుకు వస్తోంది అనేదే అర్థం కావడం లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.