March 24, 202504:36:16 AM

Saripodhaa Sanivaaram Glimpse Review: నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా.. గ్లింప్స్ సూపర్ అంటూ?

న్యాచురల్ స్టార్ నాని (Nani) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా నుంచి ఈరోజు గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్ రోల్ లో నటిస్తుండగా సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నాట్ ఏ టీజర్ అంటూ ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం గమనార్హం.

ఆగష్టు నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా 80 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనే అభిప్రాయాన్ని ఈ గ్లింప్స్ కలిగిస్తోంది. “అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.. ప్రజల్ని బాగా హింసించేవాడు” అంటూ పోలీస్ పాత్రలో ఎస్జే సూర్యను పరిచయం చేశారు. “అందుకే శ్రీ కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించాడు” అంటూ నాని చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది.

హ్యాపీ బర్త్ డే సార్ అంటూ గ్లింప్స్ ను ముగించిన విధానం బాగుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ వీడియో మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది. గ్లింప్స్ లో యాక్షన్ షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan) బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దసరా (Dasara) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో హిట్లు అందుకున్న నాని ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాత కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరగగా జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్ కు బీజీఎం హైలెట్ గా నిలిచిందని నాని ఫ్యాన్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ఇతర భాషల్లో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ న్యాచురల్ స్టార్ అభిమానులకు దగ్గరవుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.