March 22, 202501:50:24 AM

Shobana: సీనియర్ నటి శోభన షాకింగ్ డెసిషన్.. ఎందుకో అలా..!

1982 లో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ.. 1986 లో వచ్చిన ‘విక్రమ్’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభన (Shobana) . ఆ తర్వాత చిరంజీవితో (Chiranjeevi) రుద్రవీణ (Rudraveena) , రౌడీ అల్లుడు (Rowdy Alludu) …బాలకృష్ణతో (Nandamuri Balakrishna) మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి (Nari Nari Naduma Murari) , వెంకటేష్‌ (Venkatesh) తో ‘త్రిమూర్తులు’, మోహన్ బాబుతో (Mohan Babu) ‘అల్లుడుగారు’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. అయితే 1997 లో వచ్చిన ‘సూర్యపుత్రులు’ తర్వాత ఈమె సినిమాలు తగ్గించింది.

కొన్నాళ్ల తర్వాత అంటే 2006 లో వచ్చిన ‘గేమ్’ (Game) సినిమాలో నటించినా తర్వాత సినిమాల్లో కంటిన్యూ కాలేదు. అయితే ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) తో రీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో ‘మరియం’ అనే పాత్ర చేసింది. సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఈ పాత్ర శోభన చేయడం వల్ల దానికి ఇంకా అందం వచ్చింది అని చెప్పాలి. అయితే క్లైమాక్స్ లో ఈ పాత్ర చనిపోవడం అనేది చిన్న డిజప్పాయింట్మెంట్.

సెకండ్ పార్ట్ లో ఈమె ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఏదేమైనా ‘కల్కి 2898 ad’ తో శోభనకి మంచి రీ ఎంట్రీ లభించింది అనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ తర్వాత.. ఈమెకు మరిన్ని ఆఫర్స్ లభించాయట. కానీ తనకు సినిమాల్లో కంటిన్యూ అవ్వాలనే ఆసక్తి లేనట్టు తెలిపినట్టు సమాచారం.ముఖ్యంగా ‘కథాబలం ఉన్న సినిమాలు అయితే తప్ప… ఏది పడితే అది చేయడానికి సిద్ధంగా లేను’ అని ఆమె తెలిపినట్టు సమాచారం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.