April 2, 202501:21:52 AM

Thangalaan: ‘తంగలాన్’ ..తేడా కొట్టేలా ఉందిగా..!

చియాన్ విక్రమ్ (Vikram) సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు. వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఇతని గురించి చెప్పుకోవచ్చు. పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో ‘తంగలాన్’  (Thangalaan) అనే సినిమా చేశాడు. టీజర్ ఇదివరకే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అందులో విక్రమ్ పాత్ర ఓ పాము తనని కాటేసినా పట్టించుకోకుండా.. దాని తలని విరిచేసి పక్కన పారేసే విజువల్ అందరి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అని చెప్పాలి.

ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ గా పార్వతి (Parvathy Thiruvothu) , మాళవిక మోహనన్ లు (Malavika Mohanan) నటిస్తున్నారు. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను కూడా తీసుకున్నారు. అలాగే పశుపతి (Pasupathy), హరికృష్ణన్ (Harikrishnan) , అన్బుదురై (Anbudurai), ప్రీతి కరణ్, ముత్తు కుమార్ (Muthu Kumar) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 15న ‘తంగలాన్’ రిలీజ్ కానుంది.

పోటీగా తెలుగులో ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడు సినిమాలకి కనుక పాజిటివ్ టాక్ వస్తే.. దేని కెపాసిటీని బట్టి అది థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. అయితే తమిళ మీడియా నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ‘తంగలాన్’ టాక్ తేడాగా అనిపిస్తుంది. ‘తంగలాన్ ‘ ఫైనల్ ఔట్పుట్ అంత సంతృప్తికరంగా లేదట.

‘ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే.. ఇది యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది.. లేదు అంటే ప్లాప్’ అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ రిలీజ్ చేస్తున్నట్టు టాక్.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.