March 19, 202501:47:03 PM

Tripti Dimri: త్రిప్తి దిమిరి బోల్డ్ ఇమేజ్ కి ‘బ్యాడ్ న్యూస్’.!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ (Animal) సినిమా గతేడాది చివర్లో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) మెయిన్ హీరోయిన్. అయినప్పటికీ ఆమె కంటే కూడా ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)  తో బోల్డ్ సీన్స్ లో నటించిన త్రిప్తి దిమిరి (Tripti Dimri) ఎక్కువగా వార్తల్లో నిలిచింది. త్రిప్తిలా ఆ సినిమాలో మరో హీరోయిన్ నటించదేమో అనే విధంగా ఆ సినిమాతో ఆమె ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఆ సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ పై అనేక మీమ్స్ వస్తూనే ఉన్నాయి.

మరోపక్క ఆ సినిమాలో త్రిప్తి మంచి ఎమోషనల్ రోల్ ప్లే చేసింది.ఆమె పలికించిన హావభావాలు కూడా బాగుంటాయి. అయినప్పటికీ ఆమె గ్లామర్ పరంగానే క్లిక్ అయ్యింది. అందువల్ల ఆమెకు నెక్స్ట్ మూవీలో కూడా అలాంటి పాత్రే లభించింది. విషయంలోకి వెళితే.. విక్కీ కౌశల్ కి (Vicky Kaushal) జోడీగా త్రిప్తి.. బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో నటించింది. గతవారం అంటే జూలై 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

టైటిల్ కి తగ్గట్టే..’బ్యాడ్..’ గా ఉంది అంటూ ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. ఈ సినిమాలో విక్కీ కౌశల్, త్రిప్తి దిమిరి..ల మధ్య బెడ్ రూమ్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. అవి కూడా సినిమాకి ఓపెనింగ్స్ ని తీసుకురాలేకపోయాయి. సో త్రిప్తి దిమిరి కేవలం గ్లామర్ తోనే నెట్టుకు రావడం కష్టమని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.