
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 1 న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత 14 ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. అది స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారడంతో వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.
వరలక్ష్మీ తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ బ్రేక్ రాలేదు. కానీ తెలుగులో ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) ‘హనుమాన్’ (Hanu Man) వంటి సినిమాలతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటికీ ఈమె పెళ్ళికి రెడీ అవ్వడం విశేషం. ఇప్పటికే ఆమె వెడ్డింగ్ కార్డుని టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి బాలకృష్ణ (Balakrishna) ,అల్లు అర్జున్ (Allu Arjun) ,అల్లు అరవింద్ (Allu Aravidh) వంటి వారికి అందజేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇక జూలై 2 న అంటే రేపు వీరి వివాహం చెన్నైలో ఘనంగా జరగబోతుంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. ఈరోజు మెహందీ సెలబ్రేషన్స్ ను వరలక్ష్మీ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram