March 28, 202502:49:54 AM

Venkatesh: అనిల్ రావిపూడి మూవీ తర్వాత ఆ కొత్త డైరెక్టర్ తో వెంకీ మూవీ..!

విక్టరీ వెంకటేష్  (Venkatesh) కొన్నాళ్లుగా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఏ డైరెక్టర్ కి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వడం లేదు. తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వంటి యంగ్ డైరెక్టర్ అయినా.. త్రివిక్రమ్ (Trivikram) వంటి స్టార్ డైరెక్టర్ అయినా..సతీష్ వేగేశ్న (Satish Vegesna) వంటి ఫ్యామిలీ డైరెక్టర్ అయినా.. చాలా రోజులు వెంకీ కోసం వెయిటింగ్ లో ఉన్నవారే..! అయితే శైలేష్ కొలనుకి (Sailesh Kolanu) వెంటనే ఛాన్స్ ఇచ్చారు వెంకటేష్. ‘సైంధవ్’ (Saindhav) అనే యాక్షన్ మూవీని శైలేష్ డైరెక్షన్లో చేశాడు వెంకీ.

‘విక్రమ్’ (Vikram) రేంజ్లో వెంకీకి ఓ హిట్టు ఇవ్వాలని శైలేష్ అనుకున్నాడు. కానీ ఎందుకో అది మిస్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు అనిల్ రావిపూడి  (Anil Ravipudi ) దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు వెంకటేష్. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఓ నూతన దర్శకుడికి వెంకీ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జూన్ లో ‘సామజవరగమన’ (Samajavaragamana) అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దానికి రైటర్ గా పనిచేశాడు నందు. ఇటీవల అతను వెంకీని కలిసి ఓ కథ వినిపించాడు. అది వెంకీకి బాగా నచ్చిందట. దీంతో వెంటనే వెంకీ ఈ ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పేశాడట. అనిల్ రావిపూడి మూవీ పూర్తయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పై వెళ్లే ఛాన్స్ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.