March 15, 202511:59:19 AM

Venkatesh: అలాంటి కథతో వెంకీ కొత్త మూవీ.. కామెడీ మామూలుగా ఉండదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ (Venkatesh)  తనకు సూట్ అయ్యే కథలలో నటించిన ప్రతి సందర్భంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఎఫ్2(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) సినిమాలలో వెంకటేశ్ నటించగా తమ నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబో మూవీ స్టోరీ లైన్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

2025 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ గురించి ఒక విషయం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దిల్ రాజు  (Dil Raju) బ్యానర్ 58వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) , మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. టాప్ టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. వెంకటేశ్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి.

వెంకటేశ్ రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి కూడా ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారు. వెంకటేశ్ అనిల్ దిల్ రాజు ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో అనిల్ రావిపూడి సీనియర్ హీరోలపై దృష్టి పెడుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.