March 26, 202508:16:53 AM

Vishwak Sen: ‘డార్లింగ్’ ట్రైలర్ లాంచ్ లో విశ్వక్ సేన్ స్పీచ్ పై సెటైర్లు.!

ప్రియదర్శి (Priyadarshi)  , నభా నటేష్ (Nabha Natesh) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డార్లింగ్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు అమీర్ పేట్ లో ఉన్న ‘ట్రిపుల్ ఎ సినిమాస్’ లో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) హాజరయ్యాడు. ట్రైలర్ లాంచ్ అనంతరం విశ్వక్ సేన్ స్పీచ్ ఇచ్చాడు. ఇందులో ఎప్పటిలానే తన ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ.. ప్రియదర్శి గురించి అలాగే హీరోయిన్ నభా నటేష్ గురించి బాగానే చెప్పాడు.

అయితే మధ్యలో తన ‘గామి’ (Gaami) సినిమాలో డైలాగ్ ని వాడుకుని మళ్ళీ తన సినిమాల ప్రస్తావనకి వెళ్ళిపోయాడు. పోనీ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి.. పర్లేదులే అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) టెక్నీషియన్స్ అంటూ గాంధీ, కాసర్ల శ్యామ్ గురించి ముచ్చటించాడు. ‘నా సినిమా వేడుకల్లో నేను నా టెక్నీషియన్స్ గురించి మాట్లాడటం మర్చిపోతాను అంటూ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కి మంచి ఔట్పుట్ ఇచ్చారు అంటూ తన ప్లాప్ సినిమా భజన మొదలుపెట్టాడు.

విశ్వక్ సేన్.. వేరే సినిమాల ఈవెంట్లకి వెళ్లిన ప్రతిసారీ ఇలా తన సినిమాల ప్రస్తావన తీసుకొచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వక్ కి.. ‘తనని తాను స్టార్ అనే ఫీలింగ్లో ఉంటాడు’ అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అయితే అతను ‘లైలా’ (Laila) అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.