March 27, 202512:10:30 AM

70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన ‘కార్తికేయ 2’.!

70 వ జాతీయ చలనచిత్ర అవార్డులు (70th National Film Awards) పొందిన విజేతల జాబితాని తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 2022 లో విడుదలైన సినిమాలు,అలాగే ఆ ఏడాది సెన్సార్ జరుపుకున్న చిత్రాలను ఆధారం చేసుకుని ఈ అవార్డుల జాబితాని వెల్లడించడం జరిగింది. ఇందులో ‘కార్తికేయ 2’.. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు పొందింది. అలాగే ‘కాంతార’ కి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డు పొందారు. ఇక విజేతల లిస్ట్ ను గమనిస్తే :

70th National Film Awards

ఉత్తమ ఫీచర్ ఫిలిం ఆట్టం
ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి(కన్నడ) – కాంతార
ఉత్తమ నటి నిత్యా మీనన్(తిరు), మానసి పరేఖ్ (కుచ్ ఎక్స్ ప్రెస్ గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా
ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా
ఉత్తమ సహాయ నటుడు పవన్ మల్హోత్రా
ఉత్తమ చిత్రం (హోల్ సమ్ కేటగిరి) కాంతార
ఉత్తమ డెబ్యూ నటుడు ఫౌజా, ప్రమోద్ కుమార్
ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2
ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ -1
ఉత్తమ ఒడియా చిత్రం దమన్
ఉత్తమ పంజాబీ చిత్రం భాగీ డి ఢీ
ఉత్తమ మలయాళ చిత్రం సౌదీ వెలక్క CC.225/2009
ఉత్తమ మరాఠీ చిత్రం వాల్ వి
ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ : చాప్టర్ 2
ఉత్తమ హిందీ ఫిలిం గుల్మొహర్
స్పెషల్ జ్యూరీ మనోజ్ బాజ్ పాయ్(గుల్మొహర్) , సంజోయ్ సలీల్ చౌదరి(ఖాళీ ఖాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ కేజీఎఫ్ చాప్టర్ 2
ఉత్తమ కొరియోగ్రఫీ తిరుచిత్రబలం – జానీ మాస్టర్
ఉత్తమ లిరిక్స్ ఫౌజా
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ (సాంగ్స్), ఏఆర్ రెహమాన్
బెస్ట్ మేకప్ అపరాజితో
బెస్ట్ కాస్ట్యూమ్స్ కుట్చ్ ఎక్స్ ప్రెస్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అపరాజితో
బెస్ట్ ఎడిటింగ్ ఆట్టం
బెస్ట్ సౌండ్ డిజైన్ పొన్నియన్ సెల్వన్ – పార్ట్ 1
బెస్ట్ స్క్రీన్ ప్లే ఆట్టం
బెస్ట్ డైలాగ్స్ గుల్మొహర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్నియన్ సెల్వన్ – పార్ట్ 1
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సౌదీ వెలక్క CC.225/2009
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ బ్రహ్మాస్త్ర

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.