March 25, 202509:32:36 AM

Ali: డబుల్ ఇస్మార్ట్ కు అలీ ప్లస్ అవుతారా.. ఆ రోల్ ఫ్యాన్స్ కు మెప్పిస్తుందా?

రామ్ పోతినేని (Ram)  , పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్  (iSmart Shankar)  మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు నెల 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రామ్ కు జోడీగా కావ్య థాపర్ నటిస్తుండటం గమనార్హం.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ (Ali) గ్రహాంతరవాసి తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలీ రోల్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఈ రోల్ అలీ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మూవీకి అలీ ప్లస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం.

రామ్ కెరీర్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ మెమరబుల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీలో అలీ రోల్ ఫ్యాన్స్ ను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మి (Charmy Kaur) ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించడం గమనార్హం. డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రామ్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.