March 19, 202502:28:04 PM

Bhagyashri Borse: డల్ అనిపిస్తే ఆ రెండు పనులు చేస్తా.. భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)  ఒకరు. తన లుక్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ మిస్టర్ బచ్చన్  (Mr. Bachchan) సినిమాతో హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకుడు కావడం కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. మిస్టర్ బచ్చన్ మూవీ బుకింగ్స్ సైతం మరికొన్ని గంటల్లో మొదలుకానున్నాయి.

Bhagyashri Borse

తన డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ రవితేజ (Ravi Teja) , నేను డ్యాన్స్ చేయడంలో నిపుణులం కాదని సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ మేము డ్యాన్స్ చేయడం జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. మా అమ్మ డ్యాన్స్ టీచర్ గా పని చేసేవారని అమ్మ ఎంతోమందికి డ్యాన్స్ ట్రైనింగ్ ఇచ్చారని భాగ్యశ్రీ బోర్సే కామెంట్లు చేశారు. బాల్యంలో నేను బొద్దుగా ఉండేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు.

బొద్దుగా ఉండటం వల్ల నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయేదానినని ఆ సమయంలో చాలామంది గేలి చేశారని భాగ్యశ్రీ తెలిపారు. పెద్దయ్యాక మంచి డ్యాన్సర్ కావాలని ఆ సమయంలో అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విధంగా నేను డ్యాన్స్ ను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. ఎప్పుడైనా డల్ గా ఫీలైతే డ్యాన్స్, మ్యూజిక్ తో నేను ఉపశమనం పొందుతానని ఆమె వెల్లడించారు.

మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించడం నా లైఫ్ లో నేను తీసుకున్న మంచి నిర్ణయమని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. రవితేజ మాట్లాడుతూ గతంలోనే రైడ్ రీమేక్ ఆఫర్ వచ్చిందని ఆ సమయంలో నాకు ఆసక్తి లేదని తెలిపారు. హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ సినిమాపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని రవితేజ పేర్కొన్నారు.

చైతన్య శోభిత మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది.. ఆ ప్రశ్నలకు జవాబులివే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.