March 23, 202505:52:54 AM

Devara: దేవర రిలీజ్ కు 50 రోజులు.. రికార్డ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందా?

ఈ ఏడాది రిలీజైన సినిమాలలో పెద్ద సినిమాల సంఖ్య ఒకింత తక్కువనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం (Guntur Kaaram) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలై సక్సెస్ సాధించగా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న పెద్ద సినిమా ఏదనే ప్రశ్నకు దేవర సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. దేవర సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా సంచలన రికార్డ్స్ ను సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.

Devara

దేవర  (Devara) మరో 50 రోజుల్లో విడుదల కానుండగా ఈ సినిమాలో తారక్ (Jr NTR)  లుక్స్ కూడా అదిరిపోయాయని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ద్వారా అర్థమవుతోంది. తారక్, జాన్వీ (Janhvi Kapoor)  జోడీ సూపర్ జోడీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైతే మాత్రమే ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ లో నెలకొన్న సందేహాలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.

దేవర మూవీ సరికొత్త రికార్డ్స్ తో బాక్సాఫీస్ ను షేర్క్ చేయనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఒకింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రెండు భాగాలుగా దేవర మూవీ తెరకెక్కుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండటం గమనార్హం. దేవర సినిమా రిలీజ్ కు ముందే మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం. దేవర సినిమాలో కథ, కథనం విషయంలో కొరటాల శివ (Koratala Siva)  ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ దేవర2 విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.