March 25, 202509:48:41 AM

Devara: మెలోడీ సాంగ్ తో మ్యాజిక్ చేసిన అనిరుధ్.. అంతకు మించి అనేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా చుట్టమల్లే సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫియర్ సాంగ్ తో మాస్ ప్రేక్షకులను మెప్పించిన అనిరుధ్ చుట్టమల్లే సాంగ్ తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి.

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మెలోడీలలో ఈ సాంగ్ ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చుట్టమల్లే సాంగ్ ఈ ఏడాది ఛార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ఈ సాంగ్ సాహిత్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

మ్యూజిక్ లవర్స్ కు ఈ సాంగ్ నచ్చడం పక్కా అని చెప్పవచ్చు. 99 శాతం మంది ప్రేక్షకులు ఈ సాంగ్ గురించి పాజిటివ్ గా ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. సాంగ్ లో తారక్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ సైతం ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పిస్తున్నాయి. ఈ సాంగ్ తో మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులు సైతం దేవర కోసం ఆసక్తిగా ఎదురుచూడటం పక్కా అని చెప్పవచ్చు. అనిరుధ్(Anirudh Ravichander)  దేవర రిలీజ్ తర్వాత తెలుగులో మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

చుట్టమల్లే చుట్టేస్తోందే తుంటరి చూపు అంటూ ఆడియన్స్ మనస్సులను నిజంగానే మ్యూజిక్ తో చుట్టేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సాంగ్స్ లో విజువల్స్ మాత్రం గ్రాండ్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దేవర అప్ డేట్స్ లేట్ అవుతున్నా ఆ ఎదురుచూపులకు తగ్గిన ఫలితం అయితే కనిపిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సెకండ్ సింగిల్ ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అంతకు మించి అనేలా ఉన్న మెలోడీ సాంగ్ తో అనిరుధ్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.