March 25, 202510:03:58 AM

Devara: మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

‘దేవర’ (Devara) సినిమా రిలీజ్‌కు ఇంకా 45 రోజులు ఉంది. దీంతో సినిమా టీమ్‌ ఫుల్‌ స్పీడ్‌లో సినిమా షూటింగ్‌ను ముందుకు తీసుకెళ్తోంది. గతంలో వేరే తేదీ చెప్పినా ‘ఓజీ’ ఖాళీ చేసిన డేట్‌ను తీసుకోవడానికి ముందుకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో సమయం సరిపోతుందా అనే చర్చ కూడా సాగింది. ఈ క్రమంలో సినిమా మీద హైప్‌లు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. మొన్నీమధ్యే ‘చుట్టమల్లె..’ అంటూ ఓ పాట రాగా.. అలాంటిదే మరో బాంబు లాంటి పాట రెడీ చేస్తున్నారట.

Devara

ప్రస్తుతం ‘దేవర’ (Devara)  ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చిత్రీకరణలో టీమ్‌ బిజీగా ఉందట. అనిరుధ్‌ (Anirudh Ravichander)    సంగీతంతో, అద్భుతమైన విజువల్స్‌తో ‘దేవర’ ఇంట్రడక్షన్‌ పాట సిద్ధమవుతోంది. గణేశ్‌ ఆచార్య నృత్యరీతులు సమకూరుస్తున్న ఈ పాటలో ఎన్టీఆర్‌ గ్రేస్, స్టైల్‌ అభిమానులకు ఐఫీస్ట్‌గా ఉండబోతోంది అంటూ హైప్‌ పెరిగేలా ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు రత్నవేలు (R. Rathnavelu)  . సినిమా థియేటర్లలో చూస్తే పూనకాలు పక్కా అని కూడా రాశారు. ఇక సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి.

తొలి పాట ‘ఫియర్‌ సాంగ్‌’కు మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత మొన్నీమధ్య వచ్చిన ‘చుట్టమల్లె’ పాటకు వచ్చిన స్పందనను మీరే చూస్తున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కూడా బయటకు వస్తే ఇంకెలాంటి స్పందన వస్తుందో చూడాలి. మామూలుగానే తారక్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌ అదిరిపోతాయనే విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘దేవర’లో తొలి పార్టును సెప్టెంబరు 27న రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ నెలాఖరు నుండి సినిమా ప్రచారం షురూ చేస్తారని సమాచారం. సెప్టెంబరు 2న హరికృష్ణ (Nandamuri Harikrishna) జయంతి సందర్భంగా సినిమా నుండి ట్రైలర్‌ లేదా ప్రచార చిత్రం ఏదైనా ఒకటి రిలీజ్‌ చేసే అవకాశం ఉంది అని సమాచారం. అప్పుడు సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇందులో తీర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లు ఎదుర్కొంటున్న చాలా విషయాలను చర్చిస్తున్నారని సమాచారం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.