
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ,ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. పూరీ జగన్నాథ్ అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా హీరో రామ్ మార్కెట్ ను రెండింతలు పెంచింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత ఇద్దరికీ హిట్టు పడలేదు. రామ్ యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు. పూరీ జగన్నాథ్ అయితే ‘లైగర్'(Liger) తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల.. డిస్ట్రిబ్యూటర్లు పూరీ పై ఒత్తిడి చేయడం కూడా అందరం చూశాం.
Double Ismart
విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) మొదలుపెట్టిన ‘జె జిఎం'(జన గణ మన) కూడా ఆగిపోయింది. సో అటు రామ్ కి.. ఇటు పూరీకి సాలిడ్ హిట్ కావాలి. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చేశారు. ఇది ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ వంటివి మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
‘డబుల్ ఇస్మార్ట్’ ను వీక్షించిన తర్వాత సెన్సార్ వారు ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది అని వారు చెప్పారట. పూరీ జగన్నాథ్, రామ్…లు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని వారు భరోసా ఇచ్చారట. అలాగే సంజయ్ దత్ (Sanjay Dutt) , రామ్ పాత్రల మధ్య వచ్చే మైండ్ గేమ్ సినిమాకు హైలెట్ అని కూడా తెలిపారట. అంతేకాదు టెక్నికల్ గా కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ చాలా రిచ్ గా ఉందని వారు చెప్పడం గమనార్హం.