March 21, 202503:16:55 AM

Gabbar Singh Re-Release: ఆ ఏరియాలో అన్నయ్య రికార్డ్ ను తమ్ముడు బ్రేక్ చేయనున్నారా?

చిరంజీవి  (Chiranjeevi)   పుట్టినరోజు కానుకగా విడుదలైన ఇంద్ర (Indra)  మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. రీరిలీజ్ సినిమాలలో ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా ఇంద్ర నిలిచింది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం ఇంద్ర మూవీ నచ్చిందంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చని చెప్పవచ్చు. ఇంద్ర సినిమాకు ఓవర్సీస్ లో ఏకంగా 61,700 డాలర్ల కలెక్షన్లు రాగా గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా సెప్టెంబర్ నెల 1వ తేదీన రీరిలీజ్ అవుతోంది.

Gabbar Singh Re-Release

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు గబ్బర్ సింగ్ కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు పవన్ ఓజీ (OG) , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ కోసం పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఫ్యాన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే.

గబ్బర్ సింగ్ ఇంద్ర రీరిలీజ్ ఓవర్సీస్ రికార్డ్ ను బ్రేక్ చేస్తే ఒకింత సంచలనం అవుతుందని చెప్పవచ్చు. అన్నయ్య రికార్డ్ ను తమ్ముడు సులువుగానే బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఇలాంటి సమయంలో గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానుండటం,

పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రీరిలీజ్ అవుతున్న సినిమా కావడం ఈ సినిమా రీరిలీజ్ పై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలలో సంచలనాలు సాధించి రెండు రంగాలలో సక్సెస్ సాధించిన అతికొద్ది* మందిలో ఒకరిగా నిలిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోమారు మంచి మనస్సు చాటుకున్న స్టార్ హీరో.. సాయం ఎంతంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.