March 15, 202509:48:12 AM

Harish Shankar: తప్పొప్పుకోవడం కంటే తప్పించుకోవడం సులభమా శంకరా?

సోషల్ మీడియాలో హరీష్ శంకర్  (Harish Shankar) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరీష్ శంకర్ ఇప్పటివరకు ట్విట్టర్ (ఎక్స్)లో బ్లాక్ చేసినవాళ్లందరి లిస్ట్ తీస్తే, ఓ నియోజకవర్గం ఓటర్ లిస్ట్ అంత పొడుగ్గా ఉంటుందేమో. ఇక మిస్టర్ రిలీజ్ కి ముందు హరీష్ శంకర్ కాన్సిడెన్స్ చూసి, సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అయితే.. రిజల్ట్ మరీ బెడిసికొట్టకపోయినా, పర్వాలేదు అనిపించుకుంది అనుకోండి.

Harish Shankar

అయితే.. సినిమాలో బాగా పాపులర్ అయిన “సితార్” పాటలోని ఒక స్టెప్ భీభత్సంగా వైరల్ అయ్యింది. సదరు స్టెప్ లో రవితేజ (Ravi Teja) హీరోయిన్ భాగ్యశ్రీ (Bhagyashree Borse)  ప్యాంట్ ముందు భాగంలో చెయ్యిపెట్టి డ్యాన్స్ వేయడాన్ని ఏ ఒక్కరూ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. ఇదే విషయమై నిన్న దర్శకుడు హరీష్ శంకర్ ను “మిస్టర్ బచ్చన్” (Mr Bachchan)  సక్సెస్ మీట్ లో ప్రశ్నించగా.. సింపుల్ గా శేఖర్ మాస్టర్ మీదకి తోసేశాడు. షూటింగ్ ఫస్ట్ డేన బాలేదని చెబితే శేఖర్ మాస్టర్ ఫీలవుతాడని అలానే కానిచ్చేశామని హరీష్ చెప్పడం హాస్యాస్పదంగా మారింది.

సరే, షూటింగ్ ఫస్ట్ డే కాబట్టి ఏమీ చెప్పలేకపోయారు సరే. కనీసం ఎడిటింగ్ లో అయినా సదరు స్టెప్ ను కట్ చేసి, ఆ స్థానంలో ఏదైనా మాంటేజస్ లేదా వేరే స్టెప్ ఫుటేజ్ పెట్టి ఉండొచ్చు కదా? అని సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పై ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. ఇలా శేఖర్ మాస్టర్ మీదకి తోసేయకుండా, కనీసం అవును తప్పు జరిగింది అని హరీష్ శంకర్ ఒప్పుకొని ఉంటే ఇంకాస్త గౌరవంగా ఉండేదని ఇంకొందరు భావిస్తున్నారు.

“భవిష్యత్ లో ఈ పుకార్లు డబ్బులిచ్చి మరీ రాయిస్తారేమో” అంటూ తన సినిమాలో కొందరు జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేసిన హరీష్ శంకర్ పై ఇప్పుడు సదరు సెక్షన్ ఆఫ్ జర్నలిస్టులు అందరూ ఎలుగెత్తుతున్నారు. మరి హరీష్ శంకర్ సైలెంట్ గా శేఖర్ మాస్టర్ ను ముందుపెట్టేసి ఇలాగే ఉండిపోతాడా లేక ఆ విషయమై మళ్ళీ వివరణ ఇస్తాడా అనేది చూడాలి.

మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘డబుల్ ఇస్మార్ట్’.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.