March 20, 202512:14:12 PM

Heroes: ఆ సినిమా రీమేక్‌కి సిద్ధం.. ఎవరా హీరోలు.. ఏంటా కథ?

సినిమాలు రీమేక్‌ చేయడం రిస్కే.. కానీ సరైన సినిమా రీమేక్‌ చేస్తే వచ్చే లాభం.. ఇంకా ఎక్కువ. ఇప్పుడు ప్రముఖ నిర్మాత కె.కె. రాధా మోహన్‌ (K. K. Radhamohan) ఇదే పనిలో ఉన్నారు. మే నెలలో తమిళనాట విడుదలై మంచి విజయం అందుకున్న ‘గరుడన్‌’ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటున్నారు. హీరోలు (Heroes) , దర్శకుడు ఫిక్స్‌ అయ్యార

ట. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) , బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) కథానాయకులుగా ఓ సినిమా తెరకెక్కనుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Heroes

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి ‘నాంది’ సినిమా ఫేమ్‌ విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తారట. ఈ వార్త బయటకు రావడంతో ‘గరుడన్‌’ సినిమా గురించి సెర్చ్‌ చేయడం మొదలుపెట్టారు. ముగ్గురు హీరోలున్న ఈ సినిమా తమిళనాట రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కథేంటి అనేది చూస్తే.. ప్రాణ స్నేహితులైన ముగ్గురు యువకులు..

ఓ ల్యాండ్‌ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. తర్వాతి పరిణామాలే ఈ సినిమా అని చెప్పాలి. ఓ దేవాలయానికి సంబంధించిన విలువైన భూమిని కాజేయడానికి ఓ మంత్రి ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ దేవాలయానికి అన్నీ తామై రక్షించుకుంటున్న ముగ్గురు స్నేహితుల మధ్య వైరం పెడతారు. ఆఖరికి హత్యల వరకు విషయం వెళ్తుంది.

ఎవరు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు అనేదే సినిమా. సినిమాలో ట్విస్ట్‌లు కొన్ని తెలిసినట్లే ఉన్నా.. కనెక్ట్‌ అవుతాయి. ఎమోషన్స్‌, డ్రామా, యాక్షన్‌ బాగా పండించారు. అందుకే సినిమాకు అంత వసూళ్లు దక్కాయి. సూరి, ఎం.సాయికుమార్‌, ఉన్ని ముకుందన్‌ అక్కడ నటించగా.. ఇక్కడ ఎవరి పాత్రలో ఎవరు చేస్తారు అనేది కూడా ఆసక్తికరమే. ఇక ‘నాంది’ లాంటి మంచి విజయం ఇచ్చిన విజయ్‌.. ఈ సారి రీమేక్‌తో ఏం చేస్తారో చూడాలి.

బుల్లితెర షో బిగ్ బాస్ షోలో సమీరా రెడ్డి కనిపించనున్నారట.. కానీ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.