April 3, 202507:03:20 AM

IC 814 The Kandahar Hijack: చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. వెబ్‌ సిరీస్‌ రెడీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుండంటే?

నిజ జీవితానికి దగ్గరగా కథలు, నిజ జీవిత కథలు.. వెబ్‌సిరీసులుగా వస్తే వాటికి మంచి ఆదరణ దక్కుతూ ఉంది. దీంతో వెబ్‌సిరీస్‌ మేకర్లు కూడా వాటిని కథాంశంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి ఓ కథాంశంగా ‘ఐసీ 814: ది కాందహార్‌ హైజాక్‌’ (IC 814 The Kandahar Hijack) అనే వెబ్‌సిరీస్‌ సిద్ధమైంది. 1999లో జరిగిన కాందహార్‌ విమానం హైజాక్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పుడు విడుదదలైంది. 1999లో 188 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో ఢిల్లీ నుండి ఖాట్మండ్‌ ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ – 814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేశారు.

IC 814 The Kandahar Hijack

వారం పాటు ప్రయాణీకులను బందీలుగా ఉంచడంతో ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్‌గా ఈ దుర్ఘటన నిలిచిపోయింది. దానినే ఇప్పుడు ‘ఐసీ814:ది కాందహార్‌ హైజాక్‌’ (IC 814 The Kandahar Hijack) పేరుతో అనుభవ్‌ సిన్హా రూపొందిస్తున్నారు. విజయ్‌ వర్మ (Vijay Varma) , అరవింద్‌ స్వామి (Arvind Swamy) , దియా మీర్జా (Dia Mirza) , నసీరుద్దీన్‌ షా (Naseeruddin Shah) తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సిరీస్‌ ఆగస్టు 29 నుండి స్ట్రీమ్‌ అవుతుంది అని టీమ్‌ తెలియజేసింది.

హైజాక్ మొదలైన దగ్గరి నుండి ఆ తర్వాత దిల్లీలోని వార్‌ రూమ్‌లో జరిగిన ఘటనలను చూపిస్తూ ట్రైలరును ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మొదట అమృత్‌సర్‌కి విమానాన్ని తీసుకెళ్లిన హైజాకర్లు, తర్వాత దుబాయ్‌కి, అక్కడి నుండి కాంధహార్‌కు ఎందుకు తరలించారు? అనే టాపిక్‌ నుండి.. భారత ప్రభుత్వం ఏం చేసింది అనే వివరాలు ఈ సిరీస్‌లో ఉన్నాయి.

హైజాక్‌  అయిన విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఉత్కంఠగా చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన ‘ఫ్లైట్‌ ఇన్‌టూ ఫియర్ ’ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తీర్చిదిద్దారు. మరి ఈ  సిరీస్‌ ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.

హను – ప్రభాస్..ల ప్రాజెక్టు వెనుక ఇంత ‘కథ’ ఉందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.