March 17, 202507:40:41 AM

Jr NTR, Balakrishna: మళ్ళీ కాంట్రోవర్సీ తప్పదా..బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కి ఎన్టీఆర్ డుమ్మా కొడతాడా..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) న‌టుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ మొత్తం ఆయన్ని ఘ‌నంగా స‌న్మానించ‌డానికి రెడీ అయ్యింది. ఆదివారం నాడు హైద‌రాబాద్లో ఉన్న నోవాటెల్లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున‌ (Nagarjuna), వెంక‌టేష్‌  (Venkatesh) , అల్లు అర్జున్‌ (Allu Arjun), రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan), సాయి దుర్గా తేజ్‌ (Sai Dharam Tej) , అఖిల్‌ (Akhil) , విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda) , విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen) , సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ (Siddu Jonnalagadda) , గోపీచంద్‌ (Gopichand) … ఇలా చాలామంది స్టార్లు హాజరుకాబోతున్నారు.

Jr NTR, Balakrishna:

 

టాలీవుడ్ నుండే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ ఇండస్ట్రీల నుండి కూడా స్టార్లు హాజరుకాబోతున్నట్టు వినికిడి. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌  (Jr NTR)  హాజరవుతారా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కళ్యాణ్ రామ్  (Kalyan Ram)  ఏదో ఒక రకంగా బాలయ్యకి సంబంధించిన వేడుకలకి అటెండెన్స్ అయితే వేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందరి చూపు ఎన్టీఆర్ పైనే ఉంది.

నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి వేడుక జార్జిగినా ఎన్టీఆర్ కనిపించడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు గాను ఎన్టీఆర్ కి ఆహ్వానం అందినా.. అతను హాజరుకాలేదు. తన పుట్టినరోజు వేడుకలకి ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పి ఎన్టీఆర్ ఆ వేడుకను ఇగ్నోర్ చేయడం జరిగింది. మరోపక్క అదే వేడుకలో రాంచరణ్ వంటి వేరే కుటుంబానికి చెందిన హీరో హాజరుకావడంతో ఎన్టీఆర్ పై బాలయ్య ఫ్యాన్స్ విమర్శలు కురిపించారు.

సో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక కూడా కాంట్రోవర్సీకి దారి తీస్తే నందమూరి ఫ్యాన్స్ బాగా అప్సెట్ అవుతారు. కానీ అది తప్పేలా లేదు. ఎన్టీఆర్..ని ఈ వేడుకకు ఆహ్వానించాలని .. ఈవెంట్ నిర్వాహకులు ప్రయత్నించినా అతను అలాగే అతని టీం స్పందించడం లేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి.. ఫైనల్ గా ఏమవుతుందో..!

ప్రశాంత్ నీల్ కు క్లారిటీ ఇచ్చేసిన తారక్.. అప్పుడే జాయిన్ అవుతానంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.