March 20, 202511:05:51 PM

Jr NTR, Devara: దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నుండి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara) . రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘దేవర పార్ట్ 1’ గా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ కావడంతో.. అంచనాలు భారీగానే నమోదయ్యాయి. ఈ చిత్రంతో దివంగత శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)   తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.

Jr NTR, Devara

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, చుట్టమల్లె సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ‘దేవర'(మొదటి భాగం) రిలీజ్ కి సరిగ్గా నెల రోజులు టైం ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. అందులో ఎన్టీఆర్…లుక్స్ 2 రకాలుగా ఉన్నాయి. ‘ఈ ఇద్దరూ భయపెట్టడానికి రెడీ అయ్యారు’ అంటూ ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు అంతా భావిస్తున్నారు.

అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం..”దేవర’ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ అనమాట. అంటే సెకండ్ పార్ట్ మొత్తం ఆ పాత్రపైనే డిపెండ్ అయ్యి ఉండవచ్చు. అయితే ఎన్టీఆర్.. తండ్రీ కొడుకులుగా కనిపిస్తాడా? లేక అన్నదమ్ములుగా కనిపిస్తాడా? అనేది సెప్టెంబర్ 27 నే తెలుస్తుంది. ఇక ‘దేవర’ లో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ గా సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan) నటిస్తున్న సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.