March 22, 202502:43:36 AM

Kalyan Ram: హరికృష్ణ ఆ హిట్ సినిమాలో నటించడం వెనుక ఇంత జరిగిందా?

టాలీవుడ్ హీరోలలో ప్రయోగాత్మక కథలకు, విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుండగా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసార (Bimbisara) సీక్వెల్ కూడా మొదలుపెట్టనున్నారని అనిల్ పాడూరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ (Nandamuri Harikrishna) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో లాహిరి లాహిరి లాహిరిలో ఒకటి.

Kalyan Ram

వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీటెక్ పూర్తి చేసిన తర్వాత వైవీఎస్ చౌదరి గారు నాన్నగారి కోసం రాసిన లాహిరి లాహిరి లాహిరిలో కథ నాకు చెప్పారని తెలిపారు. ఆ కథ నచ్చడంతో నాన్నను ఆ సినిమాలో నటింపజేయాలని నేను భావించానని ఆయన అన్నారు. అయితే నాన్నకు ఆ సమయంలో సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని కథ విషయంలో సైతం డౌట్స్ ఉన్నాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు వైవీఎస్ చౌదరి నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. నేను పట్టు పట్టడంతో చివరకు ఆ సినిమాలో నటించడానికి నాన్న అంగీకరించాడని ఇండియాలో ఉండకుండా యూఎస్ కు వెళ్లి చదువు పూర్తి చేయాలని నాన్న నాకు షరతు విధించారని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ఆ తర్వాత యూఎస్ కు వెళ్లి ఎం.ఎస్ పూర్తి చేశానని ఆయన పేర్కొన్నారు.

నాన్న అమెరికా వెళ్లి చదువుకోవాలన్న షరతుకు అంగీకరించిన కళ్యాణ్ రామ్ తర్వాత రోజుల్లో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. హరికృష్ణ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించడం వెనుక ఇంత జరిగిందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్ రామ్ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.