March 26, 202504:59:01 AM

Kiran Abbavaram ,Rahasya Gorak Pre-Wedding: ఘనంగా కిరణ్ అబ్బవరం- రహస్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)  వంటి హిట్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క… నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఇది పక్కన పెడితే..కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak)   తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Kiran Abbavaram ,Rahasya Gorak

ఇక వీరిద్దరి వివాహం ఆగస్టు 22న జరుగుతున్నట్టు కూడా ప్రకటించారు. కేరళలో రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం…ల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ కేరళలో వరదలు వచ్చి.. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో వీరి పెళ్లి ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం- రహస్య..ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలి.

తాజాగా సంగీత్ సెలబ్రేషన్స్ లో కిరణ్ అబ్బవరం- రహస్య..ల కుటుంబ సభ్యులు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియోని రహస్య.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే కాబోయే భర్త కిరణ్ అబ్బవరంతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నట్టు కూడా ఓ ఫోటోని స్టోరీగా పెట్టింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదంటున్న ఫ్యాన్స్.. కానీ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.