March 21, 202512:51:37 AM

Kiran Abbavaram: పెళ్లి డేట్ ని లీక్ చేసిన కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్. !

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram) తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్  (Rahasya Gorak)   ను పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ వేడుక కూడా కొన్ని నెలల క్రితం జరిగింది. వీరి పెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ గా మొదట కేరళలో జరుగుతుందని వెల్లడించారు. కానీ అక్కడ వరదలు రావడంతో.. పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల పెళ్ళి వేదిక మారింది. కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్ అబ్బవరం, రహస్య..ల పెళ్ళి జరగనుంది.

Kiran Abbavaram

అయితే పెళ్ళి డేట్ ను ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతూ వచ్చింది కిరణ్ అబ్బవరం టీం. అయితే ఊహించని విధంగా కిరణ్ అబ్బవరం తన పెళ్ళి డేట్ ని లీక్ చేశాడు. ఓ వీడియో ద్వారా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం.. నిన్న నా ‘క!’ సినిమా నుండి రిలీజ్ అయిన ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ లిరికల్ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

నా ప్రతి సినిమాలోని పాటలని మీరు ఆదరిస్తున్నారు. కానీ నాకు ఈ సాంగ్ చాలా స్పెషల్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే లిరిసిస్ట్ సనాపతి భరద్వాజ్ పాత్రుడు.. నా స్నేహితుడు,నా షార్ట్ ఫిలిమ్స్ నుండి ఇప్పటివరకు మంచి లిరిక్స్ అందిస్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’ లో ‘రాజావారు రాణిగారు ఏదో రోజు ఒకటవుతారు’ అని రాశాడు. ఈ పాటలో ‘రేపో ఎల్లుండో రాణి గుండెల్లో దర్జాగా నేనుంటా’ అంటూ రాశాడు.

ఎల్లుండే నా పెళ్ళి కూడా.! థాంక్యూ భరద్వాజ్.. నాకు ఎప్పుడూ స్పెషల్ గా రాస్తుంటారు” అంటూ తన పెళ్ళి విషయాన్ని కూడా బయటపెట్టాడు. సో కిరణ్ అబ్బవరం వివాహం ఆగస్టు 22న కూర్గ్ లో జరుగుతుంది అని స్పష్టమవుతుంది. టాలీవుడ్ నుండి వీరి పెళ్లికి ఎవరెవరు హాజరవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.