
క్లీంకారకు (Klin Kaara) సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. క్లీంకార ఫేస్ అధికారికంగా రివీల్ కాకపోయినా క్లీంకార రెండో పుట్టినరోజు సందర్భంగా ఫేస్ రివీల్ అవుతుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకలలో కృష్ణుడి పూజలో క్లీంకార ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ” అమ్మ & క్లీంకార స్వీట్ సింపుల్ పూజ” అనే క్యాప్షన్ తో క్లీంకార ఫేస్ రివీల్ కాకుండా పోస్ట్ పెట్టారు.
రామ్ చరణ్ (Ram Charan) , సురేఖ కూడా పూజలో పాల్గొన్నారని సమాచారం అందుతోంది. క్లీంకారకు (Klin Kaara) చిన్న వయస్సులోనే ఎంత భక్తో అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మెగా ఫ్యాన్స్ “బుడ్డది.. భలే కూర్చుంది” అంటూ సరదాగా అభిమానంతో కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట ఈ కామెంట్స్ సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
Klin Kaara
ఈ ఏడాదే గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఏకంగా 7 పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రతి సాంగ్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami
pic.twitter.com/68LEYJISdy
— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024