March 21, 202502:22:43 AM

Mahesh Babu ,Rajamouli: రాజమౌళి మహేష్ మూవీ స్క్రిప్ట్ విషయంలో వైరల్ వార్తల్లో నిజాలివే!

మహేష్ బాబు (Mahesh Babu)  రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ కోసం మరీ ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ విడుదలై రెండున్నర సంవత్సరాలు అవుతున్నా రాజమౌళి మహేష్ మూవీ షూటింగ్ ఇంకా మొదలుకాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి గరుడ అనే టైటిల్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

Mahesh Babu ,Rajamouli

విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయిన వార్తలకు కారణం అని చెప్పవచ్చు. టీపీ విజయన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కెలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని షేర్ చేయగా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజమౌళి కాంబో మూవీ గరుడ స్క్రిప్ట్ తో తెరకెక్కాల్సి ఉందని భోగట్టా.

అయితే మహేష్ జక్కన్న మూవీ గరుడ స్క్రిప్ట్ తో తెరకెక్కనుందని వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చిత్రయూనిట్ మాత్రం వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా జక్కన్న ఈ ఏడాది ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తారో లేదో చూడాలి. రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఈ తరహా గాసిప్స్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

మహేష్ జక్కన్న కాంబో మూవీ మన దేశ భాషలతో పాటు విదేశీ భాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ ఈ సినిమా కోసం తొలిసారి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ఆ ఫ్లాప్ మూవీ రిజల్ట్ వల్ల చిరంజీవి పూర్తిగా మారిపోయారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.