March 21, 202511:04:19 AM

Murari Re-release Collections: రీ రిలీజ్లో ఆల్ టైం రికార్డు కొట్టిన ‘మురారి'(4K)

సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu)  కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది ‘మురారి’ (Murari) . ‘రామ్ ప్రసాద్ (C. Ram Prasad) ఆర్ట్స్’ బ్యానర్ పై ఎన్.దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు , గోపి నందిగం (Gopi Nandigam) ..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా శోభన్ (Sobhan) (‘బాబీ’ (Bobby) ‘వర్షం’ (Varsham) చిత్రాల దర్శకుడు) డైలాగ్స్ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. 2001 ఫిబ్రవరి 17న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. 4 వారాల వరకు ఈ సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేరు.

Murari

అనూహ్యంగా ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద గట్టిగా పుంజుకుంది ఈ సినిమా. 34 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నటుడిగా మహేష్ బాబుని మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా ఇది. మరి నిన్న అంటే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు నాడు ‘మురారి'(4K ) ని రీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది ‘మురారి’. ఒకసారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.85 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.18 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.07cr
కృష్ణా 0.15 cr
గుంటూరు 0.11 cr
నెల్లూరు 0.01 cr
ఏపీ + తెలంగాణ 2.62 cr
కర్ణాటక 0.07 cr
తమిళ్  0.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 cr
ఓవర్సీస్ 0.32 cr
వరల్డ్ వైడ్(టోటల్) 3.11 cr

‘మురారి'(4K) రీ రిలీజ్లో రూ.3.11 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.5.25 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.