March 20, 202512:14:16 PM

Nani: అవార్డుల పై నాని ఊహించని కామెంట్లు.!

నేచురల్ స్టార్ నాని (Nani) ఒక్కోసారి ఎంత లాజికల్ గా మాట్లాడినా విమర్శల పాలవుతాడు. గతంలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) రిలీజ్ టైంలో.. ‘థియేటర్లలో కలెక్షన్స్ కంటే కిరాణా కొట్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. టికెట్ రేట్లు తగ్గించడం అనేది ప్రేక్షకుల్ని అవమానించినట్టు’ అంటూ అతను పలుకగా.. వైసీపీ పార్టీ నేతలు దారుణమైన కామెంట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తర్వాత మరోసారి.. ‘నెపోటిజంని ప్రోత్సహిస్తుందే ప్రేక్షకులు.

చరణ్ ఫస్ట్ సినిమా కోటి మంది చూశారు, నాని ఫస్ట్ సినిమా లక్ష మందే చూశారు అంటే పరోక్షంగా నేపోటిజంని ఎంకరేజ్ చేస్తుంది వాళ్లే కదా..!’ అంటూ నాని పలుకగా.. చరణ్ (Ram Charan)  ఫ్యాన్స్ నానిని ఏకిపారేశారు. ఇదిలా ఉండగా.. నాని బెస్ట్ యాక్టర్. ‘జెర్సీ’ (Jersey) సినిమాకి గాను అతనికి నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. అది అందరినీ హర్ట్ చేసింది. నాని కూడా హర్ట్ అయ్యే ఉండొచ్చు. అందుకే అనుకుంట మొన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకల్లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

‘రోజు రోజుకీ అవార్డులపై ఇష్టం అనేది సన్నగిల్లుతుంది. కానీ నా సినిమా దర్శకులకి అలాగే టెక్నీషియన్స్ కి కనుక అవార్డులు వస్తే ఆనందంగా ఉంటుంది. నా వరకు అవార్డును బట్టి నటనకి విలువ ఉంటుంది అని నేను నమ్మను’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది అతను ‘దసరా’ (Dasara) తో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) , ‘హాయ్ నాన్న’ (Hi Nanna) తో శౌర్యువ్ (Shouryuv) .. వంటి నూతన దర్శకులకి ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరికీ ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.