March 20, 202506:59:48 AM

Narne Nithin: డెబ్యూ మూవీ నిర్మాతకి బాంబ్ పేల్చిన ఎన్టీఆర్ బావమరిది.!

ఎన్టీఆర్ (Jr NTR) రిఫరెన్స్ తో.. అంటే ఆయన బావమరిదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నె నితిన్. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ‘మ్యాడ్’ (MAD)  అనే సినిమా చేశాడు. ఇది అతను మొదటి సినిమాగా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ అనే సినిమా కూడా రాబోతోంది. మరోపక్క నార్నె నితిన్ (Narne Nithin) హీరోగా రూపొందిన ‘ఆయ్’ (AAY)  సినిమా ఈ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)   ‘తంగలాన్’ (Thangalaan)  వంటి పెద్ద సినిమాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Narne Nithin

దీంతో ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేసింది ‘ఆయ్’ యూనిట్. ఈ సందర్భంగా తాజాగా హీరో నార్నె నితిన్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. ‘ఆయ్’ గురించి మాత్రమే కాకుండా తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు నార్నె నితిన్. వరుసగా డెబ్యూ డైరెక్టర్లతో పని చేయడం అనేది తనకి కలిసొస్తుందని.. ‘ఆయ్’ కూడా మంచి విజయం సాధిస్తుంది అని అతను చెప్పుకొచ్చాడు.

అయితే నార్నె నితిన్ మొదటి సినిమా ‘మ్యాడ్’ కాదు. అది ముందుగా రిలీజ్ అయ్యింది కానీ.. వాస్తవానికి అతను హీరోగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్న (Satish Vegesna)  ఈ సినిమాకు దర్శకుడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు మేకర్స్ ప్రకటించారు.

‘మ్యాడ్’ తర్వాత ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ని విడుదల చేస్తున్నట్లు కూడా మీడియాకు తెలిపారు. అయితే ఆ సినిమా గురించి ఈరోజు ‘ఆయ్’ ప్రమోషన్స్ లో నార్నె నితిన్ ను ప్రశ్నించగా.. ‘ఆ సినిమా ఆగిపోయింది అండి, అనుకున్నట్టు ఆ ప్రాజెక్టు రాలేదు, అందుకే ఆపేశాం.అది ఇక రాదు’ అంటూ చెప్పి షాకిచ్చాడు. ఓ పక్క నిర్మాత ఆ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తుంటే… హీరో అయినటువంటి నార్నె నితిన్ ఇలా చెప్పడం గమనార్హం.

ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు.. వైవిఎస్ చౌదరి రెస్పాన్స్ ఇది!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.