March 25, 202510:33:08 AM

Pawan Kalyan: పవన్ కు ఐ లవ్ యు చెప్పిన యువతి.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఏడాది ఎన్నికల్లో తను గెలవడంతో పాటు పార్టీని గెలిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. పవన్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి సైతం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ గతంలో ఒక సందర్భంలో స్పీచ్ ఇస్తుండగా ఒక యువతి ఐ లవ్ యు సార్ అంటూ కామెంట్ చేశారు.

ఆ కామెంట్ విన్న వెంటనే స్పీచ్ ఆపేసిన పవన్ కళ్యాణ్ ” అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా” అంటూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు 2025 సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

పవన్ వేగంగా సినిమాలను పూర్తి చేస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. నిర్మాతలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చారని భోగట్టా. మరో నెల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే షూటింగ్ లలో పాల్గొన్న సినిమాలు కచ్చితంగా పూర్తి చేస్తారని మిగతా ప్రాజెక్ట్స్ మాత్రం పూర్తవుతాయో లేదా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కొత్త కథలు కూడా వినట్లేదని తెలుస్తోంది. పవన్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.