April 1, 202501:25:38 AM

Prabhas: వైరల్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  పాన్ వరల్డ్ స్థాయిలో నాన్ బాహుబలి (Baahubali)  ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంటూ ఎన్నో రికార్డులు సాధిస్తూ ఇతర హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రభాస్ చీమకు కూడా అపకారం చేయని హీరో అనే సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు   మాత్రం తరచూ ప్రభాస్ పై విషం కక్కుతూ తమ నీచ స్వభావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి (Kalki 2898 AD) . సినిమా తనకు నచ్చలేదని అమితాబ్  (Amitabh Bachchan)  రోల్ తో పోల్చి చూస్తే ప్రభాస్ రోల్ తేలిపోయిందని కామెంట్లు చేశారు.

Prabhas

అమితాబ్ ఈ వయస్సులో సైతం కల్కి తరహా సినిమాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమితాబ్ లో ఉన్న శక్తి మనలో కొంచెమైనా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందని అర్షద్ వార్సీ పేర్కొన్నారు. ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని అర్షద్ వార్సీ అన్నారు. అయితే అర్షద్ కామెంట్లపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

నటనలో ఓనమాలు, డైలాగ్ చెప్పడం రాని నటులు సైతం ప్రభాస్ గురించి కామెంట్లు చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కామెంట్లు చేసే వాళ్ల విషయంలో ప్రభాస్ ఒకింత సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్ ఫెయిల్ అవుతోందని ఇకపై అయినా బాలీవుడ్ నటీనటుల తీరు మారాల్సి ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ప్రామాణికం అని ఆ విషయంలో ప్రభాస్ ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అర్షద్ వార్సీ కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సూచిస్తున్నారు.

ప్రతిభ ఉన్నా సాయిపల్లవికి అవార్డ్ దక్కలేదా.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.