March 21, 202501:40:47 AM

Raj Tarun & Ariyana: రాజ్ తరుణ్- లావణ్య.. మధ్యలో అరియనా..?

రాజ్ తరుణ్  (Raj Tarun)  , లావణ్య..ల వ్యవహారం గురించి కొత్తగా పరిచయం చేయాల్సింది లేదు అనుకుంట. తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని, రెండు సార్లు అబార్షన్ చేయించి, ఇప్పుడు ‘తిరగబడరసామి’ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నప్పటి నుండి నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు’ అంటూ ఆమె పోలీస్ మెట్లెక్కింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిందే. మధ్యలో ఒకప్పటి యాంకర్ శేఖర్ భాషా కూడా సీన్లోకి ఎంటరయ్యి రాజ్ తరుణ్ తరఫున నిలబడటం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

ఈ వివాదం కారణంగా రాజ్ తరుణ్.. తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు. ‘పురుషోత్తముడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా నిలబడకపోవడానికి కారణం అదే అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకే ‘తిరగబడరసామి’ చిత్రం ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ నిన్న ప్రసాద్ ల్యాబ్స్ కి వచ్చాడు. మరోపక్క లావణ్య కూడా ప్రసాద్ ల్యాబ్స్ బయటకు వచ్చి మీడియా ముందు ముచ్చటించింది.

ఈ సందర్భంగా ‘తనకి అప్పుడే పిల్లలు వద్దు అంటూ 2 సార్లు అబార్షన్ చేయించాడు’ అంటూ ఆమె మరోసారి ఆరోపణలు చేసింది. ఇక ఈరోజు ఓ ఛానల్ కి ఆమె డిబేట్ కి వెళ్ళింది. శేఖర్ భాషా కూడా ఆ డిబేట్ కి హాజరయ్యాడు. ఈ క్రమంలో లావణ్య అతనిపై చెప్పు విసరడం జరిగింది. అనంతరం.. అరియనాకి (Ariyana) కూడా రాజ్ తరుణ్ కడుపు చేసినట్లు ఆమె చెప్పి పెద్ద షాకిచ్చింది. దీనికి శేఖర్ భాషా వ్యతిరేకించడం కూడా జరిగింది. అరియనా- రాజ్ తరుణ్.. కలిసి ‘అనుభవించు రాజా’ (Anubhavinchu Raja) అనే సినిమాలో కలిసి నటించారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.